భారతదేశం, జనవరి 5 -- టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తమిళ చిత్ర సీమలో అడుగుపెడుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కోలీవుడ్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది శ్రీలీల. ఆదివారం (జనవరి 4) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లో శివ కార్తికేయన్ పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టినట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'పరాశక్తి' చిత్ర ట్రైలర్ విడుదలైంది. సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే రాజకీయ చారిత్రాత్మక నాటకంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ కథ 1960ల నాటి భారతదేశంలో జరుగుతుంది. పరాశక్తి ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' తో పోటీ పడనుంది. జన నాయగన్ జనవరి ...