భారతదేశం, జూలై 20 -- కొత్త హీరో సినిమా జూనియర్ థియేటర్లలో హల్ చల్ చేస్తోంది. జూలై 18న ఈ మూవీ రిలీజైంది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. టాలీవుడ్ బేబీ డాల్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూనియర్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి ఆ మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.

జూనియర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ గాలి కిరీటీ రెడ్డి సినిమాకు కలెక్షన్స్ డీసెంట్‌గా వస్తున్నాయని ట్రేండ్ పండితులు అంటున్నారు. ఈ రోజు ఆదివారం (జులై 20) కావడంతో జూనియర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ జరిగినట్లు సాక్‌నిల్క్ వెబ్ సైట్ చెబుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.50 శాతం, కన్నడ వెర్షన్‌...