భారతదేశం, డిసెంబర్ 17 -- 2025వ సంవత్సరం రష్మిక మందన్న కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోతుంది. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు తన లవర్ విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఇయర్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఎండింగ్ లో కాస్త బ్రేక్ తీసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక్ టూర్ వేసింది. ఇది రష్మిక బ్యాచిలొరెట్ పార్టీ అని ఫ్యాన్స్ అంటున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు. సాధారణంగా అబ్బాయిలు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు. అదే అమ్మాయిలు చేసుకుంటే అది బ్యాచిలొరెట్ పార్టీ. ఇప్పుడు విజయ్ తో పెళ్లికి ముందు రష్మిక మందన్న తన ఫ్రెండ్స్ కు శ్రీలంకలో బ్యాచిలొరెట్ పార్టీ ఇచ్చిందని తెలిసింది.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన షూటింగ్ లు, షెడ్యూల్ నుండి కొంత బ్రేక్ ...