భారతదేశం, మే 24 -- పొరుగు దేశమైన శ్రీలంక ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. అక్కడ ఉప్పు సంక్షోభం తీవ్రమైంది. భారీ వర్షాల కారణంగా ఉప్పు ఉత్పత్తి నిలిచిపోగా, ఇతర ఉత్పత్తి చేసిన ఉప్పు కుప్పలు కూడా వర్షంలో కొట్టుకుపోయాయి. ఈ కారణంగా ద్వీప దేశం అవసరమైన పరిమాణంలో ఉప్పును కూడా ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు కొరత తీవ్రంగా ఉండటంతో దాని ధర మూడు నాలుగు రెట్లు పెరిగింది.

ప్రస్తుతం శ్రీలంకలో కిలో ఉప్పు రూ.125 నుంచి రూ.145 వరకు పలుకుతోంది. దేశంలో కేవలం 23 శాతం ఉప్పు మాత్రమే అక్కడ ఉత్పత్తి అవుతోంది. ఇదిలావుండగా శ్రీలంకకు భారత్ చేయూతనిచ్చింది. భారత్ 3050 మెట్రిక్ టన్నుల ఉప్పును శ్రీలంకకు పంపినప్పటికీ భారీ వర్షాల కారణంగా సరుకు రవాణా ఆలస్యమైంది. ఇందులో నేషనల్ సాల్ట్ కంపెనీ 2,800 మెట్...