భారతదేశం, డిసెంబర్ 20 -- నటుడిగా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా పేరుగాంచిన సీనియర్ మలయాళ స్టార్ శ్రీనివాసన్ శనివారం (డిసెంబర్ 20) మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ ప్రియమైన సినిమా దిగ్గజానికి నివాళులు వెల్లువెత్తాయి. అనేకమంది స్టార్లు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

శ్రీనివాసన్‌తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు మోహన్‌లాల్, మమ్ముట్టి. శ్రీనివాసన్ మరణం పట్ల వీళ్లు తీవ్రమైన ఎమోషనల్ కు గురయ్యారు. కేరళలోని శ్రీనివాసన్ నివాసానికి మృతదేహాన్ని తరలించినప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి అక్కడే ఉన్నారు. శ్రీనివాసన్ నివాసంలో సంతాపం తెలిపేందుకు వచ్చిన అభిమానుల సందోహాన్ని చూసి మోహన్‌లాల్ కంటతడి పెట్టారు. పక్కనే కూర్చున్న మమ్ముట్టి ఆయన్ని ఓదార్చారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మోహన్‌లాల్, శ్రీనివాసన్ కలిసి 20 చిత్రాల్లో నటించారు....