భారతదేశం, ఏప్రిల్ 23 -- హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌కు ప్రయాణించే తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఓ విషయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఆసియా కూడా ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్‌కు వెళ్లే విమానాలకు రద్దు ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్ నుండి లేదా శ్రీనగర్‌కు విమానాలు బుక్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రుసుము తిరిగి చెల్లించే సౌకర్యాన్ని ఎయిర్ ఇండియా అందించింది. ప్రయాణికులు కోరుకుంటే వారి బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చని, పూర్తి వాపసు పొందవచ్చని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.

కస్టమర్‌లు తమ బుకింగ్‌లను సులభంగా నిర్వహించడానికి www.airindiaexpress.com/manage-booking ని సందర్శించవచ్చని లేదా #SrinagarSupport అని టైప్ చేయడం ద్వారా AI-ఆధారిత చాట్ అసిస్టెంట్ టియా నుండి సహాయం పొందవచ్చని క...