భారతదేశం, జూలై 2 -- రియాలిటీ షో 'ది ట్రైటర్స్'తో అన్షులా కపూర్ తెరంగేంట్రం చేశారు. తన తండ్రి బోనీ కపూర్.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తన చిన్నప్పటి జీవితం ఎలా మారిందో మొదటిసారి ఓపెన్‌గా మాట్లాడారు. అప్పట్లో శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల లవ్ స్టోరీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం. బోనీ కపూర్‌కు అప్పటికే మోనా షౌరీ కపూర్‌తో పెళ్లయి అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లకు నాన్నగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఆయన శ్రీదేవిని కలిశారు.

1996లో బోనీ తన మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, వారి ఇంటిని వదిలేసి, అదే ఏడాది శ్రీదేవిని సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు పుట్టారు. అర్జున్ కపూర్ గతంలో తన నాన్నతో సంబంధాలు అంత బాగోలేదని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పేవారు. ఆ తర్వాత 2018లో శ్రీదేవి అకాల మరణం అన్షులా, అర్జున్‌లను వారి చెల్లె...