Hyderabad, మే 5 -- సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్‌ను సోమవారం (మే 5) ఉదయం నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, రెస్ట్ తీసుకోవడం ముఖ్యమని, ఇంకొన్ని రోజుల్లో ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం.

కాగా, శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని కుటుంబ...