భారతదేశం, డిసెంబర్ 5 -- 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ సందడిలో జరిగిన విషాద ఘటనకు ఏడాది పూర్తయిన వేళ.. బాధితుడి కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ టీమ్ స్పందించడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేరుగా రంగంలోకి దిగాడు. భాస్కర్‌ను కలిసి పరిస్థితిని చక్కదిద్దాడు.

గురువారం (డిసెంబర్ 4) నాడు దిల్ రాజు, శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం అల్లు అర్జున్ టీమ్ మీడియాతో ఒక వీడియోను పంచుకుంది. ఇందులో ఇప్పటివరకు బాధిత కుటుంబానికి అందిన సాయం వివరాలను స్పష్టంగా వెల్లడించారు.

అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఇప్పటికే మొత్తం రూ. 3.20 కోట్లు సాయం అందించారని టీమ్ తెలిపింది. ఇందులో రూ. 1.5 కో...