భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం, పైగా ఏకదాశి కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో తోపులాట జరిగటంతో.. రెయిలింగ్ విరిగిపోవటంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. "శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్ర...