భారతదేశం, నవంబర్ 23 -- సీనియర్ హీరో శ్రీకాంత్ తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. శ్రీకాంత్ కుమారుడుగా సినిమాల్లో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ హీరో రోషన్ లేటెస్ట్‌గా నటుస్తోన్న సినిమా ఛాంపియన్. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌ బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్ అని టాక్ ఉంది. దీంతో ఛాంపియన్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

ఇదివరకు రిలీజ్ చేసిన ఛాంపియన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ...