Hyderabad, జూలై 29 -- ఛైత్రాది పరిగణంలో ఆషాడం తర్వాత వచ్చే ఐదవ మాసం శ్రావణం ఈ నెలలో ఏ ఒక్కరోజో కాక నెలంతా ప్రతినాడూ పండుగే. వ్రతాలు, పూజలు, నోములు ఈ నెలలో అధికం ప్రతి శుక్రవారం ప్రతి ఇల్లాలు తానే మహాలక్ష్మి అయిపోతుంది. అంతేకాదు. ఆషాడం అడ్డు తొలగిపోయి కొత్త అల్లుళ్ళ రాకతో మరో పండుగగా భాసిల్లుతుంది. జులై 25 ప్రారంభమైన శ్రావణమాసం ఆగస్టు 23 వరకు ఉండనుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో జులై 29, ఆగష్టు 5,12,19 తేదీలలో మంగళవారాలు వచ్చాయి. ఇవి శ్రావణ మంగళవారాలన్నమాట.

జులై 25, ఆగష్టు 1,8,15,32, తేదీల్లో శుక్రవారలు వచ్చాయి. ఇది శ్రావణ శుక్రవారాన్నమాట అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

విష్ణుమూర్తిని శ్రవణా నక్షత్రం. ఆయనికి ప్రియమైన మాసము. అలాంటి శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమనే శ్రావణ పూర్ణిను'...