Hyderabad, జూలై 22 -- శ్రీ మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో ఏర్పడిన ఈ మాసంలో విష్ణువును పూజిస్తే పుణ్యాలు లభిస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సముద్ర మథన సమయంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది ఈ శ్రావణమే. శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రావణ శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన లక్ష్మీప్రదం, శ్రేయోదాయకం. శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతం ధరించి, ఉపాకర్మ ఆచరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు నూతన వేద విద్యార్థులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నూతన యజ్ఞోపవీతాలను ధరిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర...