Hyderabad, అక్టోబర్ 2 -- ప్రముఖ నటి శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తొలి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్. యు నెవర్ ప్లే అలోన్ అనే ట్యాగ్ టైన్ కూడా పెట్టారు. ఈ సిరీస్ దసరా సందర్భంగా గురువారం (అక్టోబర్ 2) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన తొలి తమిళ వెబ్ సిరీస్ ఇదే.

ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ అనే తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. నెల రోజుల కిందటే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.

సోషల్ మీడియా ట్రోల్స్ ను ధైర్యంగా ఎదుర్కొనే ఓ అమ్మాయి చుట్టే తిరిగే స్టోరీగా ది గేమ్ వెబ్ సిరీస్ కనిపిస్తోంది. ఈ సిరీస్ లోని చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేస్తూ.. స్ట్రీమింగ్ మొదలైనట్లు నెట్‌ఫ్లిక్స్ గురువా...