భారతదేశం, డిసెంబర్ 18 -- ఈ నెల ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చినప్పటి నుండి, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'దురందర్' సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ వంటి నటీనటులు అద్భుతమైన పాత్రలలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

తమ అద్భుతమైన నటన, ఆకట్టుకునే కథనం, అంతే అద్భుతంగా రాబోయే రెండవ భాగానికి ఇచ్చిన హామీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది దురంధర్. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన శ్రద్ధా కపూర్ మూవీ రివ్యూ ఇచ్చింది. దర్శకుడు ఆదిత్య ధర్, అతని భార్య యామి గౌతమ్ ధర్ లకు ఒక లేఖ రాసింది.

శ్రద్ధా కపూర్ దురంధర్ మూవీ చూసి ఇంప్రెస్ అయింది. పార్ట్ 2 కోస...