Hyderabad, జూన్ 19 -- ప్రముఖ టాలీవుడ్ నటీనటులు కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ ఇది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. శ్మశానంలో స్థలం కోసం కొట్టుకునే ఊరు, వాళ్ల మధ్య నలిగిపోయే సర్పంచ్ పాత్రలో కీర్తి సురేష్ ను ఇందులో చూడొచ్చు. ఈ సెటైరికల్ కామెడీ ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది.

ఉప్పు కప్పురంబు మూవీ ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జూన్ 29) రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ మొదట్లోనే సుబ్బరాజు అనే ఊరి పెద్ద మరణించినట్లు చూపించారు. ఆ తర్వాత అతని కూతురు పాత్ర పోషించిన కీర్తి సురేష్ ఆ ఊరి పెద్ద అవుతుంది. అసలు ఏమీ తెలియని ఆమెకు అక్కడంతా గందరగోళంగా అనిపిస్తుంది.

ఇదే సమయంలో ఆ ఊరి శ్మశానంలో స్థలం అయిపోయిందని, మరో నాలుగు శవాలను మాత్రమే పూడ్చే అవకాశమే ఉందంటూ.. ఆ ఊరి వ్యక్తి (...