భారతదేశం, జూన్ 28 -- లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూళిపాళ గురించి నాగ చైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు శోభితాతో ఎలా గడుపుతానో చెప్పుకొచ్చాడు. మ్యాన్స్ వరల్డ్ ఇండియాతో మాట్లాడిన చైతన్య.. భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ను పంచుకుంటామని చెప్పారు. ఆదివారాల్లో దంపతులు సినిమా చూసి, ఆర్డర్ చేసి, వాకింగ్ కు వెళ్తుంటారు.

శోభిత ధూళిపాళకు డ్రైవింగ్ నేర్పించానని, అది కూడా రేస్ ట్రాక్ లో అని నాగ చైతన్య చెప్పాడు. శోభిత, తాను వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడంలో ఎలాంటి టర్న్ తీసుకుంటామో కూడా పంచుకున్నాడు నాగచైతన్య. "ఆమె చదవడంలో ముందు ఉంది. నేను రేసింగ్ లో ఉన్నాను. కానీ మేమిద్దరం క్రియేటివ్ పర్సన్స్. సెలవులను ప్లాన్ చేసుకుంటాం. ఒకసారి ఆమె లీడ్ తీసుకుంటుంది. మరోసారి నేను" అని చై చెప్పుకొచ్చాడు.

పాదచారులు, ఇతర ఒత్తిడి లేక...