భారతదేశం, నవంబర్ 16 -- ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైందన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారుయ

ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగ కూడా అక్రమంగా బయటకు వెళ్లకూడదనీ. దీని కోసం ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని తాజాగా అధికారులను ఆదేశించారు. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొన్న కింగ్ పిన్స్ ను చట్టం ముందు నిలపడానికి ప్రత్యేక బృందాలను పోలీసు-అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు...