భారతదేశం, జూన్ 25 -- అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తన రెండో అత్యధిక పరుగుల ఛేదన అందుకుని టీమిండియాపై గెలిచింది. తొలి టెస్టులో 371 పరుగుల టార్గెట్ ను చేరుకుంది ఇంగ్లాండ్. దీంతో ఈ మ్యాచ్ లో శుభ్‌మ‌న్ గిల్ డిఫెన్సివ్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత టెస్టు కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లో గిల్ చాలా డిఫెన్సివ్ గా వ్యవహరించారనే ట్రోల్స్ వస్తున్నాయి.

ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో భారత్ ఓటమి నేపథ్యంలో శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్సీ శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు చేశాడు. ''శుభ్‌మ‌న్ గిల్ చాలా డిఫెన్సివ్ గా ఆడాడని చాలా మంది భావించారు. కానీ అతను బౌండరీలు కట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకున్నా. చివరికి వికెట్లు వస్తాయని ఆశించా'' అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ జ...