Hyderabad, జూన్ 30 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు కొన్నిసార్లు శుభయోగాలు, కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. 9 గ్రహాలు కూడా కాలానికి అనుగుణంగా ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి.

జూన్ 29న, ఆదివారం, శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలకు కారకుడు. శుక్రుడు రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం శుభంగా మారింది. మరి ఆ రాశులు వారు ఎవరు? వారు ఎలాంటి లాభాలను పొందారు? వంటి విషయాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి వారికి శుక్రుడి రాశి మార్పుతో గోల్డెన్ టైమ్ మొదలైంది. ఈ సమయంలో ఈ రాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వారికి జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సంతో...