Hyderabad, జూన్ 28 -- జూన్ 29న మధ్యాహ్నం రెండు గంటలకు శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, భౌతిక సౌకర్యాలు, ఆర్థిక లాభాలను అందిస్తాడు.

శుక్రుడి రాశి మార్పు, రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకుందాం.

మేష రాశి వారికి శుక్రుడు వృషభ రాశి సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడి రాశి మార్పుతో, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నుంచి బాగా లాభాలు వస్తాయి. కుటుంబ సమతుల్యత కూడా ఉంటుంది.

సింహ రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటక రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక విధాలుగా సహ...