Andhrapradesh, జూన్ 15 -- వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. గత మే నెల 15 వ తేదీ నుంచి మరీ విపరీతంగా పెరిగింది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం రెండు మూడు గంటలు పైగా తగ్గుతుంది.

శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుండి 65 వేల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ లో వివిధ టీటీడీ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే. జూన్ మాసాలలోని శుక్రవారాలలో ఎక్కవ మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

దర్శన గుణాంకాలు పరిశీలిస్తే.. శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి...