భారతదేశం, జనవరి 30 -- శుక్రవారంనాడు కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శుక్రవారం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ప్రతి రోజుకీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని వారాల్లో శుక్రవారం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం నాడు కొన్ని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

శుక్రవారం నాడు తీపి పదార్థాలను దానం చేయడం మంచిది. లక్ష్మీదేవితో పాటుగా శుక్ర గ్రహానికి కూడా ఈ శుక్రవారం ఎంతో ప్రత్యేకం. అలాగే తెల్లటి రంగులో ఉండే ఆహార పదార్థాలను దానం చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువ అవుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. శుక్రవార...