Hyderabad, సెప్టెంబర్ 3 -- అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వేదం తర్వాత ఇప్పుడు ఘాటి రాబోతోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అనుష్క ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ ఘాటి సినిమా చేసినట్లు ఆమె చెప్పింది.

ఘాటి సినిమాలో తాను పోషించిన శీలావతి పాత్ర చాలా శక్తివంతమైనదని అనుష్క శెట్టి చెప్పింది. తాను గతంలో బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి, భాగమతిలాంటి సినిమాల్లో పోషించిన పాత్రలలాంటిదే ఇది అని తెలిపింది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా చేసినట్లు అనుష్క చెప్పింది. శీలావతి పాత్రను చాలా కాలంపాటు గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేసింది.

ఘాటి మూవీ స్టోరీ తొలిసారి విన్నప్పుడు తన రియాక్షన్ గురించి కూడా అనుష్క చెప్పింది. క్రిష్, ఇంకా రైటర్ చింతకి...