భారతదేశం, నవంబర్ 12 -- రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఐకానిక్ చిత్రం 'శివ' (1989) నవంబర్ 14న థియేటర్లలో మళ్లీ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. నాగార్జున, అమల అక్కినేని, రఘువరన్ నటించిన ఈ క్లాసిక్ చిత్రాన్ని రీమాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రెస్‌తో మాట్లాడిన నాగార్జునను.. ఈ సినిమా రీమేక్‌లో తన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని నటిస్తారా అని అడగ్గా, ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శివ సినిమా చూసి నాన్న ఏమన్నారో కూడా నాగార్జున వెల్లడించారు.

'శివ'లో తనను మొదటిసారి చూసినప్పుడు తన తండ్రి (దివంగత నాగేశ్వరరావు) ఎలా స్పందించారో నాగార్జున గుర్తుచేసుకున్నారు. "సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత మా నాన్న ఆ సినిమా చూశారు. అప్పుడు రకరకాల కామెంట్లు వస్తున్నా, ఆయన నన్ను డ్రైవ్‌కు తీసుకెళ్లి సినిమా పెద్ద హిట్ అని చెప్పారు" అని నాగార...