భారతదేశం, నవంబర్ 10 -- అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 35 ఏళ్ల కిందట వచ్చి తెలుగు సినిమా దశ, దిశను మార్చేసిన సినిమా శివ. ఈ మూవీ ఇప్పుడు రీరిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వర్మతో కలిసి మీడియాతో మాట్లాడిన నాగార్జున.. ఈ మూవీని రీమేక్ చేసే ధైర్యం తన కొడుకులు ఇద్దరికీ లేదని అనడం విశేషం.

శివ మూవీ రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రామ్ గోపాల్ వర్మ, నాగార్జున షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీని రీరిలీజ్ కాకుండా.. నాగ చైతన్య లేదా అఖిల్ రీమేక్ చేసే అవకాశం ఉందా, మీరు ఆ ఛాన్స్ ఇస్తారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నాగార్జున స్పందిస్తూ.. "వాళ్లకు ఆ దమ్ము, ధైర్యం లేవని నేను అనుకుంటున్నాను" అని నాగ్ నవ్వుతూ చెప్పడం విశేషం.

ఇక శివ మూవీ కంటే ముందు తాను చేసిన సినిమాలు తనకు నచ్చలేదని కూడా నాగార్జున ...