భారతదేశం, జనవరి 2 -- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, కిస్మత్ పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని కొన్ని ప్రాంతాలు పొగమంచుతో కప్పినట్లుగా మారాయి. దీంతో హైదరాబాద్ - శంషాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణికులు వాహనాలను రహదారి పక్కన నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్ - విజయవాడ హైవేపై కూడా ఇదే మాదిరి పరిస్థితులున్నాయి. పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ - ఘట్‌కేసర్‌ బైపాస్‌ మార్గంలోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది.

ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టుల...