భారతదేశం, డిసెంబర్ 24 -- దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్, సింగర్ చిన్మయి, అనసూయ భరద్వాజ్ తమదైన శైలీలో స్పందించారు. అనంతరం తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు శివాజీ.

అయితే, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. అదే ఈవెంట్‌లో హీరో శివాజీ, దర్శకుడు మురళీకాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు అనిల్ రావిపూడి. దాంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "'దండోరా' నిర్మాత బెన్నీ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సినిమా మీద ఉండే అభిరుచి నాకు చాలా ఇష్టం. ఆయనెప్పుడూ టేస్ట్ ఉన్న చిత్రాల్నే నిర్మిస్తుంటారు. మళ్లీ డిసెంబర్ 25న ఈ 'దండోరా'తో ఆయనక...