భారతదేశం, డిసెంబర్ 29 -- 'దండోరా' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్ లపై నటుడు శివాజీ చేసిన మిస్సోజినిస్టిక్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీని 'అనాగరికుడు' అని పిలిచిన కొద్ది రోజులకే, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయనపై మరోసారి తన విమర్శల దాడిని కొనసాగించారు.

ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు ఈ మూవీ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తమకు నచ్చిన దుస్తులు వేసుకుని వచ్చారు. ఈ హీరోయిన్లు తమ కంఫర్ట్ ఉన్న బట్టలోనే రావడాన్ని పేర్కొంటూ ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ నైతికంగా మొరగడం గురించి ఎవరూ ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నాడు రామ్ గోపాల్ వర్మ.

తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆర్జీవీ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ...