Telangana, జూలై 20 -- తెలంగాణలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే - 2024 పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. తెలంగాణలో పూర్తి చేసిన ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికి రోల్ మాడల్ గా నిలుస్తుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ సభ్యులు 300 పేజీల నివేదికను సమర్పించారు. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు, సూచనలను మంత్రిమండలి సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఈ సంద...