భారతదేశం, మే 14 -- వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జాకియా ఖనమ్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. గత కొంత కాలంగా జకియా ఖనమ్‌ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో జకియాపై తిరుమలలో దర్శనం టిక్కెట్ల వ్యవహారంలో కేసు నమోదైంది.

వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌ మయానా జకియా ఖనమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌కు పంపారు. అన్నమయ్య జిల్లా రాయచోటీకి చెందిన జకియా మండలిలో డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ఉన్నారు. కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జకియా ఖనమ్ 2020 మండలికి ఎన్నికయ్యారు.

జకియా ఖనమ్‌పై గతంలో తిరుమలలో దర్శనం టిక్కెట్ల సిఫార్సు లేఖలను దళారులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో జకియా ఖనమ్‌పై కేసు నమ...