భారతదేశం, డిసెంబర్ 6 -- పర్సనల్ లోన్ పొందాలంటే కొన్ని ప్రాథమిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అవి.. మంచి క్రెడిట్ హిస్టరీ, అధిక క్రెడిట్ స్కోర్, తగిన డాక్యుమెంట్లు. ఈ డాక్యుమెంటేషన్​లో సాధారణంగా ఆదాయ ధృవీకరణ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, శాలరీ స్లిప్స్​ అందించాల్సి ఉంటుంది. రుణదాతకు మీరు లోన్​ని తిరిగి చెల్లించగలరని హామీ ఇవ్వడానికి ఈ ఇవి ఉపయోగపడతాయి.

అయితే, నేడు చాలా రుణ సంస్థలు ప్రత్యామ్నాయ క్రెడిట్ అంచనా సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నాయి. దీని అర్థం.. అసంఘటిత ఆదాయ వనరులు ఉన్నవారు లేదా స్వయం ఉపాధి పొందుతున్నవారు కూడా ఇప్పుడు రుణాలు పొందవచ్చు! ఇక్కడ కీలకం ఏంటంటే, మీరు తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉందని విశ్వసనీయమైన రుజువులను సమర్పించడం. పే స్లిప్ లేని వారికి కూడా నిర్వహించదగిన ఈఎంఐలు, వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్ ఎలా పొందవచ్చో ఈ కథనం వివర...