భారతదేశం, జూలై 14 -- శారీరక శ్రమ మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పనిలేదు. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అకాల మరణాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ తీవ్రత కలిగిన వ్యాయామం ఏదైనా కారణంతో సంభవించే మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఈ అధ్యయనం కనుగొంది. పెద్దవారిలో శారీరక శ్రమ అనారోగ్యాన్ని నివారిస్తుందని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది.

క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూయీ యు, డాక్టర్ గ్రెగోర్ ఐ. మీల్కే నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం శారీరక శ్రమ ఆవశ్యకతను నొక్కి చెబుతూ బలమైన ఆధారాలను అందించింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, శారీరక శ్రమను నిరంతరం కొనసాగించే లేదా కాలక్రమేణా దాన్ని పెంచుకునే పెద్దవారికి మ...