భారతదేశం, ఏప్రిల్ 17 -- భారత్​లో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ అమలుపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ.. శాటిలైట్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ వ్యవస్థ 15 రోజులు లేదా ఆ తర్వాత అందుబాటులోకి వస్తుందని సంకేతాలు ఇచ్చారు. 2025 ఏప్రిల్ చివరి నాటికి ప్రభుత్వం కొత్త టోల్ కలెక్షన్ టెక్నాలజీని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలకు ఆయన మాటలు ఆజ్యం పోశాయి.

గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టెమ్​ (జీఎన్ఎస్ఎస్) గా పిలిచే ఈ కొత్త టోల్ కలెక్షన్ సిస్టమ్ క్రమంగా ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ టెక్నాలజీని భర్తీ చేస్తుంది. దేశవ్యాప్తంగా కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దశలవారీగా ఫిజికల్ టోల్ బూత్లను తొలగిస్తామని గడ...