Hyderabad, మే 26 -- శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో బి12 ఒకటి. ఇది లోపిస్తే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. విటమిన్ బి12 లోపం వల్ల అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపుపచ్చగా మారడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు, బలహీనత, బరువు తగ్గడం, చిరాకు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ బి12 శరీరంలోని నరాలకు ఎంతో ముఖ్యమైనవి. విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎర్ర కణాలు ఏర్పడవు. ఎర్ర రక్త కణాలు శరీరానికి సరిపడినన్ని ఉత్పత్తి అయితే ఇది శరీరంలోని ప్రతి మూలకు ఆక్సిజన్ ను అందిస్తాయి. లేకపోతే అవయవాలకు సరైన స్థాయిలో ఆక్సిజన్ అందదు.

దీని వల్ల శరీరంలో బలహీనత కనిపించడం ప్రారంభమవుతుంది. నాడీ వ్యవస్థ కూడా సరిగా పనిచేయడం మానేస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, మీరు ఇప్పటికే తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజూ బి12 ఉండే ఆహారాలు త...