భారతదేశం, జనవరి 27 -- టెక్ దిగ్గజం శాంసంగ్​ తన తదుపరి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఏ57'ని లాంచ్​ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చైనాకు చెందిన టెలికాం అథారిటీ 'టెన్నా' డేటాబేస్‌లో ఈ ఫోన్ తాజాగా దర్శనమిచ్చింది. గత వారమే దీనికి సంబంధించిన రెగ్యులేటరీ లిస్టింగ్ వెలుగులోకి రాగా, ఇప్పుడు అధికారిక చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.

ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ (బీఐఎస్​) డేటాబేస్‌లో కూడా కనిపించిన నేపథ్యంలో, గెలాక్సీ ఏ37 మోడల్‌తో కలిసి ఇది త్వరలోనే మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్​ గెలాక్సీ ఏ57 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టెన్నా చిత్రాల ప్రకారం, గెలాక్సీ ఏ57 స్మార్ట్​ఫోన్​ పర్పుల్/లావెండర్ రంగులో మెరిసిపోతోంది. ఇది పాత గెలాక్సీ ఏ56 డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, దా...