భారతదేశం, సెప్టెంబర్ 27 -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు దుర్గమ్మ తల్లి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ అవతారం శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అనే నాలుగు శక్తుల సమన్వయం.

త్రిపురసుందరి దేవి "శ్రీ విద్యా ఉపాసనలో" అత్యంత గోప్యమైన రూపంగా భావిస్తారు. ఆమెను "శ్రీ చక్రనాయకిని"గా, "కామేశ్వరి"గా, "శ్రీ లలితా మహాత్రిపురసుందరి"గా వేదాలు, ఆగమాలు, తంత్రాలు కీర్తించాయి. తల్లి త్రిపురసుందరి సకల లోకాలను కాపాడుతూ నిలుస్తుందని పురాణాలు చెబుతాయి.

దేవి ఈ అవతారంలో పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించి, శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తారు. తల్లి ముఖచంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టిపడేస్తుంది.

త్రిపురసుందరి అవతారం "సౌందర్య లహరి"లో వర్ణించిన మహిమలను సజీవ రూపంలో ప్రతిబింబిస్తుంది. పుష్పాలతో చేసిన అలంకారంలో ...