భారతదేశం, మే 20 -- ఆంధ్రప్రదేశ్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌ అండ్ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం అందుబాటులోకి తెచ్చిన పురమిత్ర యాప్‌ ప్రజలకు నాణ్యమైన పౌర సేవల్ని అందించడంలో తోడ్పడుతోంది.

పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఎవరికైనా కనీస అవసరాలు.. పట్టణ ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసేందుకు ఉండే ఉత్సాహం పౌర సేవల విషయంలో ఉండదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన పౌర సేవల కోసం మొబలై్ అప్లికేషన్‌ను పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

పుర మిత్ర యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుంటే చాలు ఫిర్యాదిదారుడు ఎక్కడి నుంచైనా ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. శాన...