భారతదేశం, డిసెంబర్ 4 -- శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ(రసాయనాలు కలిపిన కుంకుమ) అమ్మకం నిషేధం విధించినప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోందని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం.. డిస్ట్రిబ్యూటర్ ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ అని సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ పంపిణీ చేసిన కుంకుమను విక్రయించేందుకు వివిధ విక్రేతలకు సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎన్విరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ల్యాబ్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు ముందే సమాధానం చెప్పాలని కోర్టు ఆ రెండు సంస్థలను ఆదేశించింది.

ఎరుమేలి గ్రామ పంచాయతీ ప్రాంతంలో సింథటిక్ కుంకుమ అమ్మకాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా పంపిణీ జరుగ...