భారతదేశం, ఏప్రిల్ 15 -- సోమవారం విషు పండుగ శుభ దినం నాడు శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అయ్యప్ప స్వామి చిత్రంతో కూడిన బంగారు లాకెట్లను పరిచయం చేశారు. మీరు కూడా ఈ లాకెట్ పొందాలనుకుంటే శబరిమల సన్నిధి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు. లాకెట్లు 2, 4, 8 గ్రాముల బరువులలో లభిస్తాయి.

శబరిమల గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం ఉన్న బంగారు లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణిరత్నం మొదటగా కొన్నాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో ముందుగా ఎంపికైన వ్యక్తి మణిరత్నం. అందుకే ఆయనకు మెుదటి లాకెట్‌ను అందజేశారు. విషు రోజున సన్నిధానం వద్ద జెండా చెట్టు కింద బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించారు.

మొదట ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ...