భారతదేశం, నవంబర్ 25 -- శబరిమల మండల-మకరవిళక్కు సందర్భంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణలో చర్యలలో భాగంగా 75 వేల మంది భక్తులను దర్శనం కోసం పరిమితం చేశారు. స్పాట్ బుకింగ్స్ కూడా 20 వేల నుంచి 5 వేలకు తగ్గించారు.

కేరళ హైకోర్టు కూడా భక్తులు రద్దీలో చిక్కుకోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీని ప్రకారం స్పాట్ బుకింగ్ ప్రాతిపదికన రోజుకు అనుమతించిన భక్తుల సంఖ్యను 20,000 నుండి 5,000కు తగ్గించారు. పంపాతో సహా 3 ప్రదేశాలలో పనిచేస్తున్న ఇన్‌స్టంట్ బుకింగ్ కేంద్రాలు మూసివేశారు. దేవస్థానం బోర్డు తీసుకున్న ఈ కఠినమైన చర్య వల్ల ఇన్‌స్టంట్ బుకింగ్ ద్వారా భగవంతుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గర్భగుడితో సహా ప్రాంతాలలో కూడా రద్దీ ల...