భారతదేశం, నవంబర్ 23 -- శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు. అయ్యప్పను తొలివారంలోనే 5.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. భక్తుల తాకిడితో ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమావేశమై తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. శబరిమల వద్ద రద్దీ, రియల్ టైమ్ జనసమూహం ఆధారంగా స్పాట్-బుకింగ్ పరిమితిని పెంచాలని, దర్శనాలను నిమిషానికి 85 మంది యాత్రికులకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా సమావేశంలో శబరిమల భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచానికి అనేక చర్యలను కూడా ఆమోదించారు. ప్రస్తుతం ప్రతి నిమిషానికి దాదాపు 70 మంది భక్తులు 18 మెట్లను ఎక్కుతున్నారు. ఇప్పుడు దీనిని 85కి పెంచనున్నారు. భక్తుల దర్శనాలను వేగవంతం చేయడానికి మెట్...