భారతదేశం, నవంబర్ 27 -- శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత్తం 9,40,486 మంది దర్శనాలు చేసుకున్నారు. ఈరోజుతో పది లక్షల మార్క్ దాటుతుంది. ఆలయ రద్దీకి అనుగుణంగా పంపా నుండి భక్తులను బయటకు పంపుతున్నారు.

మండల పూజ్ సీజన్‌లో బాగంగా ఈ నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోజూవారీ స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమిత చేశారు. భక్తుల రద్దీ ఆధారంగా పెంచుకోవాని కోర్టు సూచించింది. పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మండల మకరవిళక్కు సీజన్‌లో శబరిమల ఆదాయం రూ.60 కోట్లు దాటింది.

భక్తుల దర్శ...