భారతదేశం, డిసెంబర్ 8 -- శబరిమల మండల-మకరవిళక్కు నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు వెళ్తున్నారు. మరోవైపు ఇండిగో విమానాలను రద్దు కావడంలాంటి కారణాలతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సాయపడుతున్నాయి.

భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) దాదాపు 140 శబరిమల ప్రత్యేక రైళ్లను నడపుతోంది. వివిధ స్టేషన్లలో ఆగుతున్న ఈ ప్రత్యేక రైళ్లు మకర జ్యోతి దర్శనం వరకు నడుస్తాయి. ఇండిగో వివిధ విమానాశ్రయాల నుండి అనేక విమానాలను రద్దు చేయడంతో ఈ ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకోవడానికి సహాయపడతాయని ఎస్‌సీఆర్ సీపీఆర్ఓ చెప్పారు.

ఈ ప్రత్యేక రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి కొల్లం, చర్లపల్లి నుండి కొల్లం, నర్సాపూర్ నుండి కొల్లం, ఇతర గమ్యస్థానాల నుండి కూడా పలు ప్రత్యేక రైళ్లు న...