భారతదేశం, నవంబర్ 9 -- శబరిమలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. బడ్జెట్ ధరలోనే మూడు రకాల యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. శబరిమల వెళ్లాలనుకునే భక్తులు ఈ ప్యాకేజీలను చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఏపీఎస్ఆర్టీసీ శబరిమలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. డిసెంబర్ 12వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మెుత్తం మూడు యాత్ర ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే.. శ్రీఘ్రయాత్ర, సత్వర యాత్ర, యాత్ర సర్వీస్‌ పేరుతో మూడు రకాల ప్యాకేజీలు ప్రకటించారు. మరో విషయం ఏంటంటే ఈ సర్వీసులు విశాఖపట్నం నుంచి ప్రారంభం అవుతాయి.

శీఘ్రయాత్ర 5 రోజులు ఉంటుంది. విశాఖపట్నం నుంచి ...