భారతదేశం, జనవరి 14 -- శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. అయితే సంక్రాంతి రోజున 'మకర జ్యోతి'ని(మకరవిలక్కు) వీక్షించటానికి వేలాది భక్తులు పోటెత్తుతారు. ఆ రోజున సాయంత్రం కనిపించే మకరజ్యోతిని చూశాకే అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శబరిమలలో మకరవిలక్కు పండగ( మకర జ్యోతి దర్శనం) సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. సమూహ నియంత్రణకు పోలీసులు పలు మార్గదర్శకాలను ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్ధవంతమైన విధంగా స్పందించడానికి ఆంక్షలు, నిబంధనలు కఠినంగా అమలు చేయబడతాయని స్పష్టం చేశారు. ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డుతో పాటు ఇతర సంబంధిత విభాగాలు సంయుక్తంగా ఏర్పాట్లను అమలు చేస్తాయని ప...