భారతదేశం, జనవరి 10 -- హిందూ ధర్మంలో వారంలోని ఏడు రోజులకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం. ఈ క్రమంలోనే శనివారం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది శని దేవుడు. శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మ ఫల ప్రదాతగా భక్తులు కొలుస్తారు. శనివారం నాడు శని దేవుడికి, హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ముఖ్యంగా శని దేవుడి పూజలో ఆవనూనె, నల్ల నువ్వులు సమర్పించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అసలు శని దేవుడికి ఈ రెండు వస్తువులంటే ఎందుకు అంత ఇష్టం? వాటి వెనుక ఉన్న పురాణ గాథలేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

శని దేవుడికి ఆవనూనె అభిషేకం చేయడం వెనుక ప్రధానంగా రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

హనుమంతుడు - శని దేవుడి మధ్య యుద్ధం: పురాణాల ప్రకారం.. ఒకసారి హనుమంతుడికి, శని దేవుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ పోరులో శని దేవుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా నొప్ప...