భారతదేశం, జనవరి 10 -- ఖగోళ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా భావించే శని దేవుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలోని పూర్వాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్న శని, త్వరలోనే తన గమనాన్ని మార్చనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మలుపులు తీసుకురాబోతోంది.

హిందూ పంచాంగం ప్రకారం.. 2026, జనవరి 20వ తేదీ మధ్యాహ్నం 12:13 గంటలకు శని దేవుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. విశేషమేమిటంటే, ఈ నక్షత్రానికి అధిపతి స్వయంగా శని భగవానుడే. తన సొంత నక్షత్రంలోకి శని రావడం వల్ల కొన్ని రాశుల వారికి 'గోల్డెన్ డేస్' మొదలవుతాయని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా ఈ మూడు రాశుల వారిపై శని ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం:

కర్కాటక రాశి వారికి శని నక్షత్ర మార్పు ఎంతో మేలు చేకూర్చనుంది. మీరు చే...