Hyderabad, జూలై 8 -- ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటారు. అయితే మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన ఇంట్లో పెట్టే సామాన్లు లేదా మన ఇంట్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం ఇంట్లో కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. శని కేవలం మన జాతకంలోనే కాదు, మన ఇంట్లో ఉండే దిశల్లో కూడా ఉంటాడు. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం శని ఏ మాత్రం క్షమించడు.

వాస్తు ప్రకారం ప్రతి దిశకి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే ప్రత్యేక ఫలితాలను మనం చేసే వాటి ద్వారా పొందవచ్చు. కొన్ని విషయాలకు కొన్ని దిశలు అనుకూలంగా ఉంటాయి. వాస్తు ప్రకారం ప్రతి దిక్కుకి అధిపతులు కూడా ఉంటారు. మరి శని దేవుడు దిశకి సంబంధించిన ఆసక్తికరమైన విష...