భారతదేశం, జూన్ 21 -- గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేటప్పుడు మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. వీటిలో శుభయోగాలు, అశుభయోగాలు రెండు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని నెమ్మదిగా కదిలే విగ్రహం. శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 22 ఉదయం 11:43కు శుక్రుడు, శని 45 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో అర్ధకేంద్ర యోగం ఏర్పడుతుంది. అర్థ కేంద్ర యోగం శుభయోగం. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.

శుక్రుడు అందం, విలాసాలకు కారకుడు. అర్థ కేంద్ర యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది. శని, శుక్రుడి కలయికతో ఏర్పడిన ఈ అర్థ కేంద్ర యోగం కొన్ని రాశుల వారికి సంపదని అంది...